సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీసత్యసాయి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ (ఐపీఎస్) ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ( ఐపీఎస్) తో కలిసి వార్షిక తనిఖీ చేశారు. డి.పి.ఓ, స్పెషల్ బ్రాంచి, డీసీఆర్బీ విభాగాలలో అన్ని రికార్డులను మరియు పనితీరును లోతుగా ఇన్స్పెక్సన్ చేశారు. ఫ్యాక్షన్ నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేసి ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు, ఫ్యాక్షనిస్టులు వారి అనుచరులు మరియు కిరాయి హంతకుల ముఠాల కదలికలపై నిఘా వేయాలి ఫ్యాక్షన్ కేసుల్లో పారదర్షకంగా త్వరితగతిన దర్యాప్తు పూర్తీ చేసి నిందితులకు శిక్షలు పడేలా చర్యలుండాలి. ఫ్యాక్షన్ అంటేనే భయపడేలా శిక్షలుండాలి. ఇందులో కోర్టు మానిటరింగ్ సిస్టం విభాగం సిబ్బంది కూడా చురుకుగా పని చేయాలి హిందూపురం, కదిరి లాంటి సెన్సిటివ్ పట్టణాలలో కమ్యునల్ ఇష్యూస్ కు తావులేకుండా ముందస్తు సమాచారంతో అడ్డుకట్ట వేయాలి... అనుమానితులను గుర్తించి వారిపై నిఘా కొనసాగించాలి పొలిటికల్ వైరి వర్గాలు, పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ పట్ల దృష్టి సారించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కౌంటర్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవాలి. మావోయిస్టు, తదితర అసాంఘిక శక్తుల సమాచార సేకరణ కోసం ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలి పుట్టపర్తి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కావడం వల్ల ప్రమీఖులు, విదేశీయుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో పటిష్ట భద్రత కల్పించాలి మానవ అక్రమ రవాణా జరుగకుండా ప్రత్యేక నిఘా వేయాలి. గల్ఫ్ దేశాలకు మనుష్యులను తరలించే ఏజెంట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. దీనిపై సమగ్ర సమాచారం సేకరించి మానవ అక్రమ రవాణా నిరోధానికి కృషి చేయాలి జిల్లాలో ఉన్న సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలలో ఎస్పీ, ఎస్బీ డీఎస్పీలు తరుచూ సందర్శించి సమస్యలను మొగ్గ దశలోనే తుంచేయాలి డీఎస్పీలు, సి.ఐ లు వారి పరిధిల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో క్రైం మీటింగ్స్ పెట్టుకుని ఎప్ఫటికప్పుడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రొసీడింగ్స్ పంపాలి సి సి టి ఎన్ ఎస్ లో వివరాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. ఎస్ హెచ్ ఆర్ సి/ఎన్ హెచ్ ఆర్ సి పిటీషన్లపై నిర్లక్ష్యం లేకుండా చట్టపరంగా వ్యవహరించాలి సైబర్ నేరాల్లో పురోగతి సాధించాలి. ప్రజల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన తేవాలి. డీసీఆర్బీ రికార్డులు బాగా మెయింటేన్ చేసి పురోగతి సాధించాలి. పండుగలు, రథోత్సవాలు, పర్వదినాల సందర్భంగా పటిష్ట చర్యలు తీసుకోవాలి. డి.ఐ.జి, ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ , ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin