Sunday, 13 September 2026 11:54:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్యం అందుబాటులో ఉండేలా చూస్తాం...

Date : 26 October 2023 07:08 AM Views : 446

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్వకేట్ యెర్రా కామేష్ హామీ ఇచ్చారు.బుధవారం మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రాఘవాపురం,మాల బంజర,గొల్లగూడెం తదితర గ్రామాలలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ మండలంలో సాయంత్రం నాలుగు దాటితే ప్రభుత్వ వైద్యం అందడం లేదని రాత్రి సమయాలలో అత్యవసరంగా వైద్యం అవసరం వస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కావున నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని,అదే విధంగా సుమారు 24 కోట్ల రూపాయలతో నిర్మించిన సింగభూపాలెం చెరువు వలన రైతులకు పెద్దగా ఒనగూరింది ఏమీ లేదని కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినా,అదనంగా ఒక ఎకరానికి కూడా నీరు అందడం లేదన్నారు.కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు దక్కించుకున్న వారు పనులను అసంపూర్తిగా వదిలేసారని ఆరోపించారు.సదరు సింగభూపాలెం చెరువు పనులపై బహిరంగ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ అధికారంలోకి వచ్చాక భూమిలేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం సాగుభూమి ఇస్తామని,వరి పండించే పేద రైతులకు ఉచిత బోరు,3000 మద్దతు ధరను అందజేస్తామని ప్రతీ రైతుకు రెండు లక్షల రూపాయల వడ్డీ లేని వ్యవసాయ రుణాలు,ఐదు లక్షల వరకు స్వల్ప వడ్డీతో రుణాలు అందజేస్తామని,ధరణి పోర్టల్ ను రద్దుచేసి పోడు భూములకు పట్టాలిస్తామని,అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు.ప్రజలు మార్పును కోరుకుని తన ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుండేటి ఆదినారాయణ,సిద్ధల నాగేష్,గుండేటి నాగరాజు, మురిపిటి సర్వయ్య,తాళ్లూరి వస్తాజ్,మొరిపెట్టి దుర్గారావు,తరగం రవీందర్,సిద్దల వంశీ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: