సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మునిసిపల్ కేంద్రంలోని గోల్బం గ్లాకు చెందిన విలేఖరి గట్టడి అరుణ్ కుమార్ ను టిఆర్ఎస్ 32వ వార్డు కౌన్సిలర్ జనార్ధన్ రాజు అకారణంగా దాడిచేసి గాయపరి చాడు. సోమవారం రాత్రి పొద్దు పోయాక అరుణ్ ఇంటికి వస్తున్న సమయం లో టిఆర్ఎస్ కౌన్సిలర్ జనార్ధన్ రాజు, అరుణ్ కుమార్ ను మధ్యలో ఆపి కర్రతో ఇష్టానురీ తిగా కొట్టడంతో గాయాలయ్యాయి. సంఘటన తెలిసిన వెంటనే నవ నాథపురం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు స్పందించి మంగళవారం ఉదయం గట్టడి అరుణ్ కుమార్ నివాసానికి వెళ్ళి పరామర్శించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్పు ఎవరిదైనా భౌతిక దాడులకుదిగి విలేఖరికి ప్రాణహాని కల్పించి నందుకు టిఆర్ఎస్ కౌన్సిలర్ జనార్ధన్ రాజుపై కేసు నమోదు చేయాలనీ, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.... నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్, ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్ధం మాట్లాడుతూ దాడి హేయమైన చర్య అని తీవ్రంగా ఖండిస్తూ నిందితు నికి చట్టప్రకారం శిక్షపడేలా చూడాలని ఎస్ఐ గాజుల ప్రదీప్ ను కోరారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు విన్సెంట్, చరణ్ గౌడ్, సల హాదారులు గనేశ్ గౌడ్, శ్రావణ్, అశోక్, మహిపాల్, శికారి శ్రీనివాస్, తమ్మి వినోద్, రాజేందర్ పాల్గొన్నారు...
-----------------------
Admin