సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని ఉష ముళ్ళపూడి రోడ్డు లోని ఇండియన్ బ్యాంక్ నుండి ఎల్లమ్మ చెరువు అలుగు వరకు రూ.2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న వరద నీటి కాల్వ సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బుధవారం జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన వరద నీటి కాల్వ సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణం పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, అవసరమగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొనిలోతట్టు ప్రాంతలలోని నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని అన్నారు.ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, గుడ్ల శ్రీనివాస్, పోశెట్టిగౌడ్, రాజు గౌడ్,ఏ ఈ.శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాంట్రాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin