Wednesday, 29 July 2026 06:24:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతాంగాన్ని మోసం చేయడంలో పోటీ పడుతున్న మోడీ, కేసీఆర్...

Date : 09 September 2023 05:47 AM Views : 284

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : దేశ రైతాంగాన్ని మోసం చేయడంలో పిఎం మోడీ, రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడంలో సిఎం కేసీఆర్ పోటీ పడుతున్నారని, ఇలాంటి రైతు వ్యతిరేకులను గద్దె దించితేనే రైతాంగానికి న్యాయం జరుగుతుందని, వ్యవసాయరంగం పరిరక్షించబడుతుందని తెలంగాణ రైతు సంఘా రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు శుక్రవారం శేషగిరిభవన్లో జిల్లా స్థాయి రైతు సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిధులుగా హాజరైన నేతలు మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో వ్యవసాయరంగం బతకాలంటే బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దెదించేందుకు కార్మికులు, కర్షకులు సిద్ధం కావాలన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో ఆదానీ, అంబానీ లాంటి కుబేరులకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే కుట్రలకు పూనుకుందన్నారు. సబ్సీడీలలో భారీగా కోతలు విదిస్తూ భవిష్యత్తులో పూర్తిగా ఈ సబ్సీడీలను ఎత్తివేసి రైతులను నట్టేట ముంచి కార్పోరేట్ శక్తుల ఊతం ఇస్తున్నారన్నారు. రైతుబంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసానికి పాల్పడుతుండగా అదేబాటలో మోడీ సైతం ఎకరాకు ఆరువేల రూపాయలంటూ రైతులను మభ్యపెట్టి మరోసారి గద్దెనెక్కే కుట్రలు చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతుబంధు పథకాలు కేవలం భూస్వాముల ఖజానాను నింపేందుకే ఉపయోగపడుతున్నాయని, సన్న, చిన్నకారు రైతులకు, కౌలు రైతులకు ఈ పథకాలు మేలు చేయడం లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సఫర్ భీమా యోజన పథకం భీమా సంస్థలకు దోచిపెట్టేందుకేనని, భీమా పేరుతో 57వేల కోట్లు ఈ భీమా సంస్థలకు అప్పనంగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంబవించినప్పుడు ఆదుకునేందుకు ఎటువంటి భీమా సౌకర్యం లేదని, రైతు రుణాల మాఫీకి సంబందించి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెచ్చెల రంగారెడ్డి, ఏఐపికెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మండల వెంకన్న, ఏఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి మాట్లాడుతూ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన 385 రోజులపాటు సాగిన ఉద్యమం చారిత్రాత్మకమని, ఈ ఉద్యమంతో నూతన సాగుచట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించిన మోడీ దొడ్డిదారిన అమలు చేసే కుట్రలకు తెరలేపారని, మోడీ మోసపూరిత చర్యలను నిరసిస్తూ ఢీల్లీ ఉద్యమ తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రైతును రాజును చేసేందుకు జస్టిస్ స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలుచేస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ గద్దెనెక్కిందే తడవుగా సిపారసులను అముల చేయకుండా రైతాంగంపై యుద్ధం ప్రకటించాడని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా రైతులు, జర్నలిస్టుల హత్యకు కారకులయ్యారని ఆయన్ను తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 3 దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 23 నుంచి మూడు రోజులపాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు రైతాంగం సన్నద్ధం కావాలని, అందుకు విపక్ష రైతు సంఘాలు భాద్యత తీసుకొని రైతులను ఉద్యమాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘాల జిల్లా నాయకులు చండ్ర నరేంద్రకుమార్, అన్నవరపు సత్యనారాయణ, కల్లూరి కిషోర్, కందగట్ల సురేందర్, బానోతు ఊక్లానాయక్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎస్ కె.సాబీర్ పాషా, అన్నవరపు కనకయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, ఎల్.విశ్వనాధం, యలమంచి వంశీకృష్ణ, సలిగంటి శ్రీనివాస్, ముద్దా బిక్షం, బుర్రా వెంకన్న, వి.కోటేశ్వర్రావు, బట్టు ప్రసాద్, రేసు ఎల్లయ్య, ఏజే రమేష్, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పరబోయిన రమ్మూర్తి, కె.రత్నకుమారి, పద్మజ, రేపాకుల శ్రీనివాస్, అమర్లపూడి రాము, కొక్కెరపాటి పుల్లయ్య, కున్సోతు ధర్మ, వూకంటి రవికుమార్, దొడ్డ లక్షయ్మ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :