సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి ఇరవై ఐదు శాతం ఉన్న గౌడ్స్ కి ప్రతి జిల్లాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులు సూర్యాపేట జిల్లా ప్రధానకార్యదర్శి గుండు రాంబాబుగౌడ్,నియోజకవర్గ అధ్యక్షులు జనిగల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తండు వెంకన్న గౌడ్,గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు యరగాని కిరణ్ గౌడ్, అన్ని రాజకీయాపార్టీలను విజ్ఞప్తి చేశారు.తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణం టౌన్ హాల్ లో జరిగిన గౌడ అఖిలపక్ష మీటింగ్ లో మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో టికెట్స్ విషయంలో అన్యాయం జరుగుతుంది అని ఈసారి ఇవ్వకపోతే ప్రతి నియోజకవర్గం నుండి గౌడును పోటీకి పెట్టి గెలిపించుకుంటామని తెలిపారు. అదేవిదంగా గౌడులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు తో బాటు దళిత బందు మాదిరిగానే గౌడ బందు ఏర్పాటు చేయాలి అని, సాధారణముగా మరణించిన గీత కార్మికులకు పది లక్షలు బీమా ఇవ్వాలి అని, గీతన్నలకు, సెప్టిమొకూ లతోపాటు, మోటర్ బైక్ లు ఇవ్వాలి అని, తాటి ఈత వనమును పెంచుకునుటకు ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల భూమి కేటాయించి, వాటి సంరక్షణ ప్రభుత్వమే చేపట్టాలని కోరారు. వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో గౌడ సంక్షేమ భవన్ ఏర్పాటు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు గండు అర్జున్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వల్లపుదాసు నాగరాజు గౌడ్,పట్టణ ఉపాధ్యక్షులు ఓరుగంటి రామకృష్ణ గౌడ్, మధు గౌడ్,బత్తిని మల్లయ్య గౌడ్,బెల్లంకొండ శ్రీను గౌడ్, బత్తిని ఉదయ్ కుమార్ గౌడ్,గండు వెంకట్ గౌడ్, నాల్లపటి సైదులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin