Thursday, 30 July 2026 03:35:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబులదేవర చెరువు లో తూతూ మంత్రంగా మండల సర్వ సభ్య సమావేశం...

Date : 06 July 2023 07:17 AM Views : 431

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువుమండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్వీన్ భాను జెడ్పిటిసి కుర్లి దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో వారు మాట్లాడుతూ ప్రజల కోసమే ఈ ప్రభుత్వం వుందని పేర్కొన్నారు. గత సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసిన పనులు సాధించిందేమిలేదని, విద్యుత్ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయని, గౌరాపురం, టీ. కుంట్లపల్లి తదితర గ్రామాలలో విద్యుత్ లైన్లు క్రిందికి వేలాడుతున్న విషయాన్ని ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాధుడే లేడని, ఇకనైనా వాటిపై దృష్టి కేంద్రీకరించాలని అల్లాపల్లి , వెంకటాపురం సర్పంచ్ లు వెంకటరమణ శంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం ఎంపీటీసీ శ్రీనివాసులు మాట్లాడుతూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుబాటులో స్ట్రెచర్స్, వీల్ చైర్ల సౌకర్యం లేదని, ప్రాథమిక కేంద్రం నూతన భవనాన్ని ఎప్పుడు కడతారోనంటో సభలో గర్తు చేశారు. మంజూరైన జగనన్న నూతన గృహాలకు ఇసుక దొరకడం చాలా కష్టంగా మారిందని, ఇసుక కోసం తాసిల్దార్ కు వినతి కోరితే పరిశీలించి ఇసుక తోలుకోవడానికి పరిమిషన్ మంజూరు చేస్తామన్నారు. మండలంలో పలుచోట్ల మోటార్లు మరమ్మత్తు కు గురై నెలకొన్న తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మండల ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డి రాజశేఖర్, పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ వ్యవసాయ అధికారి ఇలియాస్ అహ్మద్, మార్కెట్ యాడ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీదేవి , తాసిల్దార్ రామనాథ్ రెడ్డి ,కోఆప్షన్ నెంబర్ నిసార్ అహ్మద్, ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, మండల విద్యాధికారి సురేష్ బాబు, రమణ, సూపర్డెంట్ రెడ్డప్ప, సర్పంచులు గోవిందు ,వెంకటరమణ, రంగారెడ్డి ,శివశంకర్ రెడ్డి, జగన్మోహన్ చౌదరి, సీనియర్ అసిస్టెంట్ గజ్జల శ్రీనివాసరెడ్డి, హెచ్ ఓ లావణ్య తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :