సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : మే నెల ప్రారంభమైనప్పటి నుంచి ఎండలు మండుతున్నాయి ఆదివారం సుజాతనగర్ మండల కేంద్రంలో మండుటెండలో సైతం ప్రజలు వ్యాపారస్తులు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుస్యంగా మారాయి నిత్యం రద్దీగా ఉండే సుజాతనగర్ మెయిన్ రోడ్ సెంటర్ వాహనాలు తిరగక ప్రయాణికులు లేక రోడ్లన్నీ బోసి పోయాయి ఎండ వేడిమి తట్టుకోలేక చాలామంది చల్లని పానీయాలు కొబ్బరినీళ్లు కూల్ డ్రింక్స్ త్రాగడానికి ఎక్కువగా సేవిస్తున్నారు అత్యవసర పనులు అయితే తప్ప ఇళ్లల్లో ఉంటూ ఏసీ ఫ్యాన్ లో మధ్య గడుపుతున్నారు చిన్నపిల్లలను వృద్ధులను అవసరమైతే తప్ప బయటకి తీసుకురావద్దని వైద్యులు సలహాలు ఇస్తున్నారు...
-----------------------
Admin