సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బాబు జగ్జీవన్ రామ్ వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన స్వాతంత్య్రోద్యమం, కు నిర్మూనకోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలు కన్న ముద్దుబిడ్డ డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అనీ ఆన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నివాళి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశ స్వరాజ్య ఉద్యమంతో, తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన జగ్జీవన్‌రామ్ జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రిక ప్రాధాన్యత కలిగి ఉంది. జగ్జీవన్‌రామ్‌ని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వాతంత్య్రం, సామాజికోద్యమాల ప్రాంగణాన జరిగిన, ఉప్పొంగిన సమరోజ్వల సమున్నత ఘట్టాలను గుర్తు చేసుకోవడమే ఆన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ బాబర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కే చిన్నయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, చింతపండు సత్తయ్య, సింగిల్ విండో డైరెక్టర్ జితేందర్ రెడ్డి, బ్యాటరీ కృష్ణారెడ్డి, నర్సింలు, నరసప్పగూడ మాజీ సర్పంచ్ కావలి కృష్ణ, ముబారక్, ఖదీర్, గంగ మూవీ సత్తయ్య, పసుల బుచ్చయ్య, సాములయ్య, సందీప్, నవపేట్ కాజా, సీతారాం, గండ్రాతి సాయి, శివరాములు, ప్రభు, లింగారెడ్డిగూడెం అశోక్, శేఖర్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin