సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుండి జిల్లా బిఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్ పర్యటించనున్నట్లు మండల బిఆర్ఎస్ నాయకులు గురువారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని పలు గ్రామాలలో నిర్మితమవుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి తదుపరి ప్రత్యేక సమావేశాలలో పాల్గొననున్నట్లు తెలిపారు. కావున మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సకాలంలో ఈ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సూచించారు...
-----------------------
Admin