సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : అశ్వాపురం మండల టీడీపీ నేతలు,ప్రధాన అనుచరులపై, అక్రమ కేసులను పెట్టి అరెస్టులు చేయించడం అన్యాయమని సోమవారం ఓక ప్రకటన విడుదల చేసారు తాతా మాధవి లత మాట్లాడుతూ.. 35 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న తుళ్లూరు బ్రహ్మయ్య పై, మరియు టిడిపి నేతలపై కేసులు నమోదు చేయడం హెమమైన చర్యని పేర్కొన్నారు. వారి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది సమంజసం కాదని అన్నారు. రాజకీయంగా ఇబ్బందులు గురి చేయటం ఎన్నికల సమయంలో ఈ టైంలో వారిపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై అరెస్టు వారెంట్లు తీసుకురావడం చాలా బాధాకరమని ఇకనైనా ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని లేనియెడల రానున్న ఎలక్షన్లలో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పే గడువు దగ్గరలో ఉన్నదని దానికి ఫలితం అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు.
-----------------------
Admin