సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చింత పల్లి మండలo."మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగు నీరు" బిందెలతో మహిళలు కనిపించకుండా చేయడమే ధ్యేయం... నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, -ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్... మిషన్ భగీరథ ద్వార అని గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించనున్నట్లు నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.సోమవారం చింతపల్లి మండల పరిధిలోని గొడుకొండ్ల, ప్రశాంతపురి, గొల్లపల్లి విరాట్ నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగిరథ పథకాన్ని చేపట్టిందని, భవిష్యత్తులో తాగు నీటి ఇక్కట్లనేవి లేకుండా ఉండేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంతున్నారని తెలిపారు.దేవరకొండ నియోజకవర్గం లోని గ్రామాలలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపటనున్నట్లు ఆయన తెలిపారు.వేసవిలో గ్రామాలలో నీటి ఎద్దడి తొలగనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్...
-----------------------
Admin