సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సిఐటియు) దేశంలో అనేక పోరాట ఫలితంగా కార్మిక చట్టాలను హక్కుల్ని సాధించిన ఘనత సిఐటియుకి మాత్రమేనని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు అన్నారు. స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం నందు నిర్వహించిన సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జండా ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ నేడున్న బిజెపి మత విద్వేష పరిపాలన అలాగే మతోన్మాదంతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక చట్టాలను రద్దు చేయడం కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన లేబర్ కోడ్ లను సృష్టించడం కార్మిక వర్గాన్ని అణిచివేస్తున్నటువంటి బిజెపికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రతిజ్ఞ బోనాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాబోయే కాలంలో అన్ని రకాల కార్మికులను సమీకరించి కనీస వేతన సాధన పని గంటల తగ్గింపు సంఘం పెట్టుకొని హక్కు బేరసారాలాడే హక్కుని నిలుపుకోవడానికి అన్నారు, మతోన్మాద బిజెపిని వెనక్కి కొట్టకపోతే కార్మిక వర్గానికి గొడ్డలిపేట్టు అయ్యే పరిస్థితిలు ఉన్నాయని రాబోయే కాలంలో ఐక్యంగా పోరాడి హక్కులు సాధించే దిశగా కార్మిక వర్గం పనిచేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ జిల్లా నాయకులు చల్లా జయకృష్ణ , ఉపతల్ల వెంకన్న , పల్లపు రామకృష్ణ, శీలం వేణు , గుండు వెంకన్న, ధారా శాంమ్, అశోక్ , అక్బర్ , అఖిల్ కుమార్ , సురేషు ,వెంకన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin