సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని సాయిబాబా కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల సదస్సు నిర్వహించారు .ఆ సదస్సుకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాల్గోని కోదండరాం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రౌడీయిజం గుండాయిజం టిఆర్ఎస్ పార్టీ వాళ్లు చేయని అరాచకం లేవు 10 సంవత్సరాలు భరించాం ఇప్పటికైనా మనం తెలంగాణ తెచ్చుకుంది కొన్ని వేల మంది బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణను మన నీళ్లు మన ఉద్యోగాలు మన భూములు ఆంధ్ర వాళ్లు అనుభవిస్తున్నారని తీసుకుపోయారని ఆరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు కానీ నేడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు తెలంగాణ ఉద్యోగులకు వల స కార్మికులకు మాత్రం శూన్యం అందుకే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేసి ఈ దోరల గడిల రాజ్యం నుండి కుటుంబ పాల నుండి తెలంగాణను తెలంగాణ ప్రజలను కాపాడుకుందాం నాడు కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు నేటి వరకు నిన్నటి వరకు ఉద్యోగ నియమాలకు జరుగు పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేక పోయారు పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు నిన్న మొన్నటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో కూడా సరిగా నిర్వహించలేకపోయారు దాని మూలంగా 10 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు టిఆర్ఎస్ పార్టీ రెండు లక్షల 30 వేల ఉద్యోగాలులో 60 వేల ఉద్యోగాలే అధికారికంగా నియమించారు ప్రజలకు మీడియాకు మాత్రం 1లక్ష 30 వేల మందిని ఉద్యోగాలు ఇచ్చినవని అబద్ధపు మాటలు చెబుతున్నారు ఆ ఉద్యోగాలలో కూడా ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాత్రమే ఇవ్వబడినది ఇంకా లక్ష అరవై వేల మంది వివిధ శాఖలో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నది కానీ ఇప్పటివరకు చేయలేదు ఆరుకాలం పండించిన రైతుల ధాన్యాన్ని కొనుగోలుకు కూడా సరైన గిట్టుబాటు ధర కల్పించలేకుండా రైతులను ఇబ్బంది పెట్టారు పండిన ధాన్యాన్ని కూడా కొనలేకపోయారు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆరు నెలల్లో అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తామని చెబుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ హామీలను తప్పనిసరిగా అమలు చేస్తుందని మాటిస్తున్నాను విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డు మీదకు వచ్చి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఓటు వేసి నిరుద్యోగుల చావుకు కారణం కావద్దు అని చెబుతున్నారు నేడు నిరుద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రచారం చేయటం నిరుద్యోగులు ఎంత బాధ పడుతున్నారో వారి కుటుంబాలలో ఎంత బాధ పడుతున్నారు అర్థమవుతుంది అని అన్నారు. నాటి తెలంగాణ ఉద్యమకారులను కాదని తెలంగాణ ద్రోహులకు అందల మెక్కించి మినిస్టర్ పదవులు ఇచ్చి తెలంగాణ ప్రజలను దోచుకుంటుంది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం కావున అందరం హస్తాం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపిద్దాం అంటున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో సాముల శివారెడ్డి, తన్నీరు మల్లికార్జున్, ఏర్రగాని నాగన్న, అల్లం ప్రభాకర్ రెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, గల్లా వెంకటేశ్వర్లు, మేళ్ల చెరువు ముక్కంటి, అరుణ్ కుమార్ డేశ్ ముఖ్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin