సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమణ అలియాస్ రామన్న దారుణ హత్యకు గురయ్యాడు. లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంగా యూసుఫ్‌గూడకు చెందిన యువతి రౌడీ షీటర్లతో హత్య చేయించిందా.,? మర్మాంగాలు కోసి క్రూరంగా చంపేయగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది మంది ఒకేసారి మూకుమ్మడిగా కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి, అతడి మర్మాంగాలను కోసి దారుణంగా హతమార్చారు. ఒళ్లు గగుర్లుపొడిచే భయంకరమైన సంఘటన నగరంలోని యూసఫ్ గూడ లో జరగగా స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
-----------------------
Admin