సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నల్లగొండపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకల్లు జగదీశ్వర్ రెడ్డి ఆదేశానుసారం నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపును కాంక్షిస్తూ మఠంపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో మఠంపల్లి గ్రామంలోని మామిళ్ళ చెరువు వద్ద ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తుకి ఓటు వేయాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలను ఇచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో వారిని ప్రజలు నమ్మేలా లేరని ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రస్తుతం గుర్తించారని ఈ సందర్భంగా వారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పిండిపోలు రామచంద్రయ్య , ఎంపీటీసీ బానోతు సైదమ్మ , డిసిసిబి డైరెక్టర్ కోమ్ము కరుణ సైదులు , మాజీ ఉపసర్పంచ్ జాల కిరణ్ , బిఆర్ఎస్ నాయకులు ఆరాల నాగరాజు, వీరస్వామి, పోతబత్తిని శ్రీనివాస్, కూరాకుల నరసయ్య, కొమ్ము ఇమ్మానుయేలు, గాయం రామాంజి రెడ్డి, చింతల నరసింహారావు మరియు పలువురు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin