Thursday, 30 July 2026 12:33:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరో వినూత్న పథకం... శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ సుజల పథకం...

Date : 24 September 2023 05:09 PM Views : 432

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజక వర్గంలో అనేక గిరిజన తండాల్లో వాటర్ ప్లాంట్ సౌకర్యం లేక అపరిశుభ్రమైన నీటిని గిరిజనులు తాగుతున్నారని వారి కోసం పరిశుద్ధమైన జలాన్ని అందించేందుకు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ సుజల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ లోగల విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని 250 నుండి సుమారు 300 జనాభా గల తండాల్లో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీనికోసం గిరిజన ప్రజలు ఆ తండాలకు సంబంధించిన యువత ఒక కమిటీ ద్వారా రాజకీయాలకు అతీతంగా తండాలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒక దరఖాస్తు తమకు అందజేయాలని పేర్కొన్నారు. వారి దరఖాస్తులు పరిశీలించి రూ. 3.5 లక్షలతో ఒక సొంత గదితో పాటు ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దీనికోసం స్థలం తండావాసులు స్థలం చూపాలని మిగతా కార్యక్రమాలు ట్రస్టు చూసుకుంటుందని అన్నారు. వాటర్ ప్లాంట్ నిర్వహణ కోసం బిందెకు ఒక రూపాయి నిర్వహణ ఖర్చు నామ మాత్రంగా పెట్టి ఆ డబ్బుతో గిరిజన తండాలోని ఎవరికైనా నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పి ఆ డబ్బు వారే తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక సంవత్సరం పాటు వాటర్ ప్లాంట్ నిర్వహణను పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ స్వయంగా చూసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం గానీ ఇతర ఏజెన్సీ సంస్థలు గాని గ్రామ సర్పంచ్ గాని ప్లాంట్ నిర్వహణ చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారికే ప్లాంట్ అప్పచెప్తామని అన్నారు. వాటర్ ప్లాంట్ కార్యక్రమాలను నియోజక వర్గంలోని దొంతికుంట తండా, పుల్చర్ల కుంట తండా, కడియాల కుంట తండాలలో లాంచనంగా ప్రారంభిస్తామని అన్నారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 28 సేవలు చేపట్టినట్టు చెప్పారు. ఇటీవల గత 45 రోజుల్లో రాఖి చీరల పంపిణీ, హెల్మెట్ పంపిణీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రజల కొసం చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ప్రజలు విజయవంతం చేశారని మీడియా సహకారం మరువలేనిదని అన్నారు. ఇదివరకే 20వేల హెల్మెట్లు పంపిణీ చేశామని చెప్పారు. 9100 డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చామని, ఇంకా 5200 డ్రైవింగ్ లైసెన్సులు డిమాండ్ ఉందని వాటిని కూడా త్వరలోనే అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అమడపురం నర్సింహా, నర్సింహా యాదవ్, ఇస్నాతీ శ్రీనివాస్, సుధాకరప్ప, మోహన్ సింగ్, లష్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :