సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ లోని స్థానిక బాయ్స్ ఎడ్యుకేషన్ హాబ్ లో ఇంటర్మీడియట్ విద్యార్ధులకు శ్రీ సత్యసాయి సేవా సమితి గజ్వేల్ వారి ఆధ్వర్యంలో శ్రీ KVS సాయికుమార్(హైదరాబాద్) గారు శ్రీ M.మధుసూదన్ రెడ్డి( హైదరాబాద్) గారి చే . లక్ష్యసాధన-జీవిత విజయం అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు ... పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, లక్ష్యాన్ని ఎలా నిర్ధారించుకోవాలి లక్ష్యసాధనకు చేయవలసిన పనులు మొదలైన అంశాలు విద్యార్థులకి వివరించడం జరిగింది... ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవ సమితి గజ్వేల్ కన్వీనర్ శ్రీ సిహెచ్ వెంకన్న గారు, బాలవికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి లావణ్య గారు మరియు సభ్యులు G. తులసీదాస్ గారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి వాసవి గారు, కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు...
-----------------------
Admin