Wednesday, 29 July 2026 11:08:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు...

Date : 20 January 2023 01:05 AM Views : 564

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టర్ స్థానిక 43వ డివిజన్ లోని రేవతి సెంటర్ కమ్యూనిటీ హాల్, 37వ డివిజన్ లోని పాత మునిసిపల్ కార్యాలయం, రఘునాథపాలెం మండలం వివి పాలెం, చింతకాని మండలం వందనం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. శిబిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించి, నమోదులు జాగ్రత్తగా చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 55 బృందాలను ఏర్పాటుచేసి, 100 రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేపట్టేలా కార్యాచరణ చేసినట్లు తెలిపారు. కంటి వెలుగు అనగానే కంటి చూపు పరీక్ష అనే తేలిక భావం ఉంటుందని, కానీ ప్రతి మనిషికి కంటి చూపు ఎంత అవసరం అనే విషయాన్ని గుర్తించాలని ఆయన తెలిపారు. నివారించదగ్గ అంధత్వాన్ని మనం పరీక్షలు చేసుకొని వెంటనే నివారించు కోవాలని ఆయన అన్నారు. శిబిర నిర్వహణ విషయమై ముందస్తుగా విస్తృత ప్రచారం చేయాలని, ప్రజల సమీకరణ చర్యలు పకడ్బందీగా చేయాలని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పని చేసి ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆయన తెలిపారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా నగర మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. మాలతీ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, వైద్యాధికారులు డా. నాగమణి, డా. ప్రేమలత, డా. వెంకటనరసయ్య, డా. సంధ్యారాణి, డా. ఉషారాణి, డా. వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం ఎంపిడివో రామకృష్ణ, కార్పొరేటర్ క్లెయిమేట్, వందనం సర్పంచ్ సునీత తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :