సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలానికి అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ మహిళా డప్పు కళా బృందానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు అందె మ్యూజిక్ అకాడమీ నుండి పిలుపు రావడంతో వైజాగ్ కీ మహిళా డప్పు కళాకారులూ బయలుదేరారు.ఈ సందర్బంగా సతీష్ మహిళా డప్పు కళా బృందం డైరెక్టర్ అమరవరపు సతీష్ మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో జాతీయ జానపద దినోత్సవం నిర్వహించనున్న వేడుకలకి తమ బృందానికి పిలుపు రావడంతో వైజాగ్ కళా బృందంతో బయలుదేరడం జరిగింది అని అన్నారు. తమ బృందానికి ఇంత చక్కని అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా,, మామిడి హరికృష్ణ కి అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నమని అన్నారు. సతీష్ మాట్లాడుతు తమ గ్రామం & మండలం నుండి కళాకారులకీ ఈ అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని. వీరు చేసే డప్పు నృత్య ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంటుందని వీటిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యావత్తు ప్రపంచానికి తెలుస్తుందని మా మండలానికి మంచి పేరును తీసుకువస్తున్న మహిళా డప్పు కళాకారులకు ధన్యవాదములు అని అన్నారు. ఈ కార్యక్రమం మహిళా డప్పు బృందం కళాకారులూ పాల్గొన్నారు....
-----------------------
Admin