సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలో దారుణం పద్మావతి అనే మహిళ పై కత్తులతో రాడ్లతో దాడి. కదిరి మశానం పేట లో తమ ఇంటి వద్ద వాషింగ్ మెషిన్ పెట్టిందన్న నెపంతో వివాదం చోటు చేసుకుంది. గొడవ కాస్త పెద్దదవడంతో ప్రకాష్ నాయక్,వేమన నాయక్ అనే తండ్రికొడుకులు ఆ మహిళ పై దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ ను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు.ఐతే పద్మను బెంగుళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
-----------------------
Admin