సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఈ నెల 3వ తేదీ నుంచి జరుగనున్న నామినేషన్లు ప్రక్రియకు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు. చేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలులో నామినేషన్లు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. ఈ నెల 5వ ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించబడవని చెప్పారు. ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు వస్తే టోకెన్లు జారీ చేసి క్రమసంఖ్య ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. ముహూర్తాలు బావున్నాయని ఆ రోజుల్లో అధికసంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నామినేషన్ ప్రక్రియపై అవగాహన, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. నామినేషన్లు ప్రక్రియకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ. తప్పక పాటించాలని చెప్పారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులను, మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్నదని చెప్పారు. జనరల్, బీసీ అభ్యర్థులకు రూ. 10 వేల డిపాజిట్ ఉంటుందని, రిజర్వుడు అభ్యర్థులకు 5 వేల రూపాయలు డిపాజిట్ ఉంటుందని, రిజర్వుడు అభ్యర్థులు కుల ధృవీకరణ అందచేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఓటు ఉన్నా అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఉందని, అయితే బలపరిచే వ్యక్తులు ఆ నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలని చెప్పారు. ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఆయా మండలాల తహసిల్దారుల ద్వారా పొందిన ధృవీకరణ అందచేయాలని చెప్పారు. నామినేషన్లో అసంపూర్తిగా ఉన్న అంశాలపై ఆర్వో నోటీసులు జారీ చేయాలని చెప్పారు. నామినేషన్లు వివరాలను క్రమం తప్పక రిజిష్టరులో నామినేషన్లు దాఖలు తేదీ, సమయం తప్పని సరిగా నమోదులు చేయాలని చెప్పారు. ఆర్టీ కార్యాలయాల్లో ఓటరు జాబితా, చెల్లిస్టు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆర్డీఓ నిషిత పరిశీలన తదుపరి నామినేషన్ పత్రాలపై ధృవీకరణ చేయాలని చెప్పారు. ప్రతి రోజు నామినేషన్లు దాఖలు పై ఆర్డీఓలు నివేదికలు అందచేయాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నయంగా విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఈ నెల 5న ఆదివారం ప్రభుత్వ సెలవు కావడంతో నామినేషన్లు తీసుకోరని చెప్పారు. ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు వచ్చినట్లయితే టోకెన్లు జారీ చేసి క్రమసంఖ్య ప్రకారం నామినేషన్లు తీసుకోవాలని చెప్పారు. ముహూర్తాలు బావున్న రోజుల్లో నామినేషన్లు వేసేందుకు అధికసంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న నామినేషన్లుపై అభ్యర్థులకు ఆర్వో నోటీ సులు జారీ చేయాలని చెప్పారు. సాధారణ అభ్యర్థులకు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నామినేషన్ వివరాలను ప్రతి రోజు నోటీసు బోర్డులో పెట్టాలని చెప్పారు. అనంతరం నామినేషన్ పత్రాలు పూర్తింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం నియోజకర్గాల రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, కార్తిక్, మంగీలాల్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, డిటి రంగప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin