సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ హైటెక్ బస్టాండ్ మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలంలో నిర్మించాలిని గురువారం మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ డిఎం రామ్మోహన్ రెడ్డి గారికి బీసీ సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మిర్యాలగూడ జనాభా 50 వేలు ఉన్నప్పుడు అదే బస్టాండు తిరిగి మరల ఆరు లక్షల జనాభా ఉన్న అదే బస్టాండ్ ఉన్నది కావున బస్టాండ్ ముందల ఉన్న సాగర్ రోడ్డు, లో అన్ని రకాల షాపులు కూరగాయల మార్కెట్ బట్టల షాపులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కావున ట్రాఫిక్ పెరుగుతుంది, రోడ్లు చిన్నవిగా ఉన్నాయి జనాభా పెద్దగా ఉన్నది అవునా అలానే బస్సులను ప్రైవేట్ బస్సులను అండర్ టేకింగ్ బస్సులను యజమానులు వారి ఇంటి దగ్గరే పార్కింగ్ చేసుకోవాలి, జనాభా కనుగుణంగా వసతులు కల్పించాలి , అలానే మిర్యాలగూడ బస్ డిపోను జిల్లా స్థాయిలో, పెద్దగా విస్తరింపజేసి, మిర్యాలగూడ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములకు తరలించాలి సూర్యాపేటలో ఉన్నట్టు ఒక హైటెక్ బస్టాండ్ లో నిర్మించాలి, హైదరాబాద్ కు వెళ్ళు మహిళా ఫ్రీ బస్సులను ప్రతి గంటకు నడపాలనీ బీసీ సంఘం నాయకులు చేగొండి మురళి యాదవ్ వినతిపత్రంలో కోరారు, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులను ఎన్నుకుంటే స్థానిక సమస్యలు తెలుస్తాయని ఒక ప్రకటనలో తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు , బీసీ సంఘం నాయకులు సత్య ప్రకాష్ నాయుడు, బీసీ యువజన సంఘం నాయకులు సురేష్ యాదవ్, సత్య, నారాయణ, ఆశిష్, కిరణ్ సంతోష్ తదితరులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు
-----------------------
Admin