సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాదులో గాలిపటం మాంజా దారానికి బలై ప్రాణాలు కోల్పోయిన.. ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖలో అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానికులు భారీగా హాజరయ్యారు. గోల్కొండ మిలటరీ హాస్పిటల్ నుంచి వచ్చిన సిబ్బంది కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతదేహానికి ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. గౌరవ వందనం సమర్పించి.. సైనిక లాంచనాలతో జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. జవాన్ కోటేశ్వర్ రెడ్డికి చెందిన నాలుగు తరల వాళ్లు ఆర్మీలో పని చేశారు. అదే స్ఫూర్తితో కోటేశ్వర్ రెడ్డి కూడా ఆర్మీలో చేరారు. రిపబ్లిక్ డే నాడు జన్మించారు కోటేశ్వర్ రెడ్డి. కూతురు కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు పుట్టింది. ఇటీవల ఆమె తొలి పుట్టిన రోజు వేడుకలకు కూడా ఘనంగా చేశారు కోటేశ్వర్ రెడ్డి. ఆర్మీ డ్రెస్ అంటే ఎనలేని అభిమానం గౌరవం. ఆ డ్రెస్ లోనే వెళుతుండగా.. ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి మాంజా దారానికి బలై ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ మెడికల్ కోర్ టీంలో కోటేశ్వర్ రెడ్డి నాయక్ గా పని చేస్తున్నారు. గోల్కొండ మిలటరీ హాస్పిటల్ లో నాయక్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
-----------------------
Admin