సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా పల్లె ప్రగతి దినోత్సవం ను పెద వీడు గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమంలో మఠం పల్లి ఎంపిపి పార్వతి కొండా నాయక్, పెద వీడు గ్రామ సర్పంచ్ బిబి కుతుబ్ , ఎంపిటిసి కుందూరు వెంకట రెడ్డి పాల్గొ న్నారు సపాయిలను .సన్మానించి,వారికి ప్రసంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినంకా,గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందాలని, కె సి ఆర్ పల్లె ప్రగతి అనే కార్యక్రమంను తలపెట్టినాడు,ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పల్లె అభివృద్ధికి నోచుకుంది అని,ప్రతి వీది పరిశుభ్రంగా,వున్నది అనీ,ఆనందం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ ,స్పెషల్ ఆఫీసర్ వార్డు నెంబర్‌లు , అంగన్ వాడీ టీచర్స్ లింగమ్మ, శారద, సంధ్య, వి బి కె లు నాగమణి, రాణి శ్రీలత,ఆశా కార్యకర్తలు ,గ్రామపంచాయతీ సిబ్బంది, బిల్ కలెక్టర్ నగేష్,రవి, చార్లిష్, జయమ్మ, మార్తమ్మ తదితరులు పెద్దలు పాల్గొన్నారు.
-----------------------
Admin