సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు వేగవంతం చేయాలనిజిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో డిఎంఎఫ్టి, ఎస్డీఎఫ్, ఎస్సీఏ, సిడిపి, సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులపై ఇంజినీరింగ్ అధికారులు, కంపెనీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పనుల పురోగతిని ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ ప్రారంభించని పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అదనపు సిబ్బందిని ఏర్పాటుతో వేగవంతం చేయాలని చెప్పారు. నిధులు మంజూరు చేసినా ఎందుకు జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా ఇంజినీరింగ్ శాఖల అధికారులు పనులు ఎప్పటివరకు పూర్తి చేస్తారో షెడ్యూల్ ఇవ్వాలని, ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని చెప్పారు. మంజూరైన పనులకు వారం రోజుళ్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ప్రగతిలో ఉన్న పనులు పూర్తి చేయడం, ప్రారంభించని పనులకు టెండర్ ప్రక్రియ నిర్వహించాలని, పూర్తి అయిన పనులకు ఆయా నియోజకవర్గ శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మాణంలో ఉన్న అంగన్ వాడి భవనాలను పనులు పర్యవేక్షణ చేస్తున్న ఇంజినీరింగ్ అధికారులు, ఆయా శాఖల అధికారులు సంయుక్త తనిఖీ చేసి నివేదికలు అందచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైన్, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, సిపిఓ శ్రీనివాసరావు, ఇంజినీరింగ్ అధికారులు, కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin