సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలి, జగతి మెచ్చేలా జయంతి ఉత్సవాలు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతి వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని సత్య సాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతి వేడుకలపై వివిధ శాఖల అధికారులతో ముందస్తు ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, డిఆర్ఓ కొండయ్య, సంబందిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతనసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన నిర్వహించే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతి వేడుకల సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు పుట్టపర్తి పట్టణంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, తదితర ప్రాంతాల్లో హెల్ఫ్ డెస్క్ ను ఏర్పాటు చేయా లన్నారు. పుట్టపర్తిలో శానిటేషన్ కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టాలని, నిర్వహించాలన్నారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, అవసరమైతే మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ లను శుభ్రంగా ఉంచాలని, ఎక్కడ కూడా వర్షం పడినా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, తగిన సిబ్బందిని నియమించాలని, చిత్రావతి నది పర్విక ప్రాంతము నందు విద్యుత్ దీపాలంకరణలతో ఏర్పాటు చేయాలని అవసరమైన చోట్ల అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలన్నారు. పట్టణంలో అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, మిగిలిన రహదారుల మరమ్మతు పనులు, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో వీధిలైట్ల ను ఏర్పాటు చేయాలన్నారు. పుట్టపర్తికి దగ్గరలోని పర్యాటక ప్రాంతాలను తెలియజేసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరం జరగాలన్నారు. పట్టణంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాట్ల విషయమై ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా చూడాలని తెలిపారు. ఈనెల 18 నుండి 24వ తేదీ వరకు జరిగే ఉత్సవాలు వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను సక్రంగా నిర్వహించాలని తెలిపారు. ఈనెల 23వ తేదీన కేంద్ర టూరిజం శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన కిషన్ రెడ్డి పర్యటన ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో నలుమూలల నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి కి వస్తారని తెలిపారు. మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు రోడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక పోలీస్ శాఖలను ఆదేశించారు. 22వ తేదీన డీమ్డ్ యూనివర్సిటీ 41 వ కాన్వకేషన్ ముఖ్య అతిథులు ఇస్రో చైర్మన్ పాల్గొంటారు, 23వ తేదీన కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు ప్రముఖుల పర్యటిస్తారు తెలిపారు. 24వ తేదీనఉత్సవాలు ముగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారి జి నాగేశ్వర్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ ఎస్సీ ఈ శర్వాన్, ఆర్టిసి అధికారి టి మధుసూదన్, పుడ వైస్ చైర్మన్ కే నరేష్ కుమార్, ఆర్టీవో కరుణాకర్ రెడ్డిె, ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర, ఎంపీడీవో అశోక్ కుమార్ రెడ్డి, డిపిఓ విజయ్ కుమార్, డి ఆర్ డి పి డి నరసయ్య, dwma పిడి రామాంజనేయులు, ఎస్ సి పి ఆర్ గోపాల్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, డిఎంహెచ్వో, ఎస్ వి కృష్ణారెడ్డి,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin