సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు:రైతుబందు 2023 వానకాలం పెట్టుబడి సహాయం పొందటానికి కొత్త పాస్ పుస్తకాలు, డ్రాఫ్ట్ బుక్స్ 18జూన్2023 నాటికి పొందిన రైతులు అందరూ రైతుబందు పథకానికి తేదీ 28.జూన్.2023 లోగా దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి బుంగరాజు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ సమక్షంలో రైతు బంధు దరఖాస్తులను రైతుల నుంచి తీసుకొని మాట్లాడారు. రైతులు ఎవరైనా రైతుబందు పథకంలో బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలి అనుకుంటే మళ్ళీ ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తుఫారం,పట్టాదారు పాసుపుస్తకంజీరాక్స్ లేదా డ్రాఫ్ట్ పట్టాబుక్ జీరాక్స్,బ్యాంక్ అకౌంట్ పుస్తకం జీరాక్స్,ఆధార్ కార్డు జీరాక్స్లతో క్లస్టర్ కు సంబందించిన వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎఈఓ మీసాల వెంకటేష్,రైతుకు కొండ ఎల్లయ్య,రవికుమార్,లక్ష్మమ్మ,మౌలానా,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin