సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: భవిష్యత్తులో యువత ఏ అంశంపైన పోరాటాలు చేయాలన్నా ముందుగా వారు మానసిక,శారీరకంగా ధృడంగా ఉండాలని బీవీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఈసంపల్లి రాకేష్ సూచించారు.బీఎస్పీ ఆధ్వర్యంలో రెండు రోజులు కొత్తగూడెం అసెంబ్లీ బీవీఎఫ్ శిక్షణ తరగతులు స్థానిక ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో నిర్వహించారు.బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ చేతుల మీదుగా యువత కి బహుజన్ వాలంటరీ ఫోర్స్ (బీవీఎఫ్) టీ-షట్స్ అందజేశారు.అనంతరం బీవీఎఫ్ శిక్షణ తరగతుల్లో యువకులు పాల్గొని వ్యాయామం చేశారు.ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఏడేళ్ల పదవీ కాలం ఉన్నా బీఎస్పీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అత్యున్నత పదవికి రాజీనామా చేసి,రాజకీయాల్లో సమూల మార్పు కోసం నడుం బిగించారని అన్నారు.ఆర్ఎస్పీ నేతృత్వంలో రాష్ర్టంలో పార్టీ బలోపేతం కావాలంటే యువత భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించే వారిని తెలిపారు.ఆ క్రమంలో భాగంగానే బహుజన్ వాలంటరీ ఫోర్సు(బీవీఎఫ్)ను ఏర్పాటు చేశారని అన్నారు.యువత రాజకీయాల్లోకి రావాలంటే విద్య,సమాజంలో జరిగే సంఘటన పై అవగాహన ఉంటే సరిపోలేదని అన్నారు.ప్రస్తుత కాలంలో యువత రాజకీయాలలో రాణించాలన్నా,సమస్యలపై ఎదురు నిలబడి పోరాడాలన్నా అందుకు మానసిక,శారీరక దృఢత్వం ఉండాలని ఆకాంక్షించారు.శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ముందుకు సాగాలని సూచించారు.దేశ సేవ చేయడం కోసం ఆర్మీలో చేరాలన్నా,చట్టాన్ని కాపాడడం కోసం పోలీసు శాఖలో చేరాలన్నా బీవీఎఫ్ లో శిక్షణ తీసుకోవాలని అన్నారు.కొందరు యువత ధూమపానం,మద్యపానం,డ్రగ్స్ వంటి దుర్వేసనాలకు అలవాటుపడి తమ అమూల్యమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అలవాట్ల వల్ల విచక్షణను కోల్పోయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వీటికి దూరంగా ఉండాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఎంతో విశాల దృక్పథంతో స్థాపించిన బీవీఎఫ్ లో యువత చేరి తమ భవిష్యత్తును ఉన్నంతగా మలుచుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జర్పుల కళ్యాణ్,గూగులోత్ రాహుల్,ఎర్రంశెట్టి ఉపేందర్,ధనుంజయ్,పూర్ణ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin