సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి బూర్గంపాడు మండల పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని ప్రజా సమస్యల మీద ప్రశ్నించినందు కు అక్రమ అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని అదేవిధంగా జిల్లాలోని కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజా సమస్యల మీద ప్రశ్నించకుండా వారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లాలోని బి ఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి దృష్టి పెట్టి కెసిఆర్ ద్వారా నిధులను మంజూరు చేయించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ నాయకులు బట్ట విజయ గాంధీ,జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మెహమూద్ ఖాన్, మండల నాయకులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకట నారాయణ, నాయకులు పూలపెల్లి సుధాకర్ రెడ్డి, బూర్గంపాడు పట్టణ అధ్యక్షుడు మందా నాగరాజు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin