Thursday, 30 July 2026 08:15:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేడే షాద్ నగర్ కు ముగ్గురు మంత్రులు రాక...

Date : 29 May 2023 11:18 PM Views : 492

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నిమోజకవర్గం పరిధిలోని చటాన్ పల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ చొరవతో తీరనున్న చటాన్ పల్లి, షాద్ నగర్ ప్రయాణీకుల ఇక్కట్లు. ఇక్కడి రెండు దశాబ్దాల కల చటాన్ పల్లి రైల్వే బ్రిడ్జి.. అంజన్నతోనే సాధ్యం అయ్యింది. త్వరలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయి. రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజల తరపున సీఎంకు గతంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇక్కడ అండర్ పాస్ వద్దు అంటూ స్థానికులు అప్పట్లో ఆక్షేపణం పెట్టడంతో ఈ పనులు కొంత ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. ఎట్టకేలకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ప్రభుత్వ నిధులు 95 కోట్లతో శంకుస్థాపనకు శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి ముహూర్తం మంగళవారం నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఎమ్మెల్యే అంజయ్య ఆహ్వానంతో ఇక్కడికి రానున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి రూ. 404 కోట్లతో పనులను మంజూరు చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని చటన్ పల్లికి రైల్వే నిధులు 33.69 కోట్లు కేటాయించగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం 95 కోట్లు తన వాటా ప్రకటించింది. ఇంతకాలంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎట్టకేలకు ఈ పనులకు ఎమ్మేల్యే కృషితో శంకుస్థాపన జరగబోతుంది. దశలవారీగా పట్టణంలో అనేక సమస్యత్మక ప్రాంతాలను గుర్తించి అనేక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పట్టణంలో చాలా పెద్ద సమస్య తీరబోతుందని పలువురు కొనియాడుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: