సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం పట్టణంలోని జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు.5. 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నదే సీఎం చంద్రబాబు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్దేశము అని ఎరిక్షన్ బాబు అన్నారు. ఈ పథకము ద్వారా పేద విద్యార్థుల ఆకలి తీర్చడమే కాకుండా డ్రాప్ అవుట్ విద్యార్థుల హాజరు తగ్గటం వంటి సమస్యలు ఉండవని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పథకం ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం ఆయన వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, మండల విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin