సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, కలెక్టరేట్ : అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అంగన్వాడీలకు 26 వేలు వేతనం చెల్లించాలని, అంగన్ వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరిగా ఉండటం సరికాదని,వారి న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.19వ రోజుకు చేరుకున్న అంగన్ వాడీల నిరవధిక సమ్మెకు బస్టాండ్ చిల్డర్స్ పార్క్ వద్ద,కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్ వాడీ ఉద్యోగులకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ అంగన్ వాడీలచే ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుందని,కనీస వేతనం అందక అంగన్ వాడీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,అంగన్ వాడీలను వెంటనే పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని,పెన్షన్,ఈఎస్ఐ సదుపాయం,ఉద్యోగ భద్రత కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు పది లక్షలు,ఆయాలకు 5లక్షలు ఇవ్వాలని,సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగుల పట్ల కక్షసాధింపు ధోరణి ప్రదర్శించుకుండా వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి..బీఎస్పీకి పట్టం కట్టాలని బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్ వాడీలను పర్మినెంట్ చేసి,రూ.30వేల వేతనం అందిస్తామని రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ప్రకటించారని తెలిపారు ఈకార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నాగుల రవికుమార్,అల్లకొండ శరత్,కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి గోపి,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin