సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువులో జాతీయ డెంగ్యూ దినోత్సవంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య వైద్యాధికారి ఐ నొద్దిన్ పేర్కొన్నారు. స్థానిక ఆరోగ్య వైద్యశాల నుండి వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ర్యాలీగా వెళ్తూ దోమలు పుట్టరాదు దోమలు కుట్టరాదు అని నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ కుడిలి వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు వారు మాట్లాడుతూ అపరిశుభ్రత నివారణే డెంగ్యూ నివారణకు మార్గమని ప్రతి శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు డ్రైడే పాటించాలని తద్వారా దోమలు పుట్టకుండా చేసినట్లయితే డెంగ్యూ వ్యాధిని నివారించ వచ్చని తెలియ జేసినారు . దోమ పుట్టకూడదు దోమ కొట్టకూడదు అంటూ నినాదాలు చేశారు. పగటిపూట కుట్టే దోమల వల్లనే డెంగ్యూ జ్వరాలు వస్తాయని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దోమలు పుట్టకుండా చేయవచ్చునని దోమల వచ్చే వ్యాధులైన మలేరియా ,డెంగ్యూ ,చికున్గున్యా , ఫైలేరియా మరియు మెదడువాపు లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేసారు .కావున ప్రజలందరూ దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.తప్పని సరిగా డ్రైడే పాటించాలని ,పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని యిండ్లలోని కూలర్లలోని నీటిని ఎప్పటి కప్పుడు మార్చుకోవాలని కోరారు .కొబ్బరి బొండాలు ,పూలకుండీలు ,టైర్లు రోళ్ళు ,పాడుబడిన ప్లాస్టిక్ సామానులలో నీరు నిల్వ లేకుండా చూడాలని ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ ఈ ఓ లాలు నాయక్, సిహెచ్ఓ సుభాషిణి, సూపర్ వేజర్ మురళి, మద్దిలేటి మనోహర్, ఏఎన్ఎం లు, ఆశ, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin