Monday, 14 September 2026 07:18:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీపురం శివారులో మహిళా దారుణ హత్య...

Date : 21 May 2026 12:41 PM Views : 1873

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మహిళ దారుణ హత్య కు గురైన సంఘటన చోటుచేసుకుంది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి సుమలత (35)కు ఇద్దరు పిల్లలు కుమారుడు జశ్వంత్, కుమార్తె తేజస్విని ఉన్నారు. ఆమె భర్త మహేందర్ అనారోగ్యంతో నాలుగు సంవత్సరాల కిందట చనిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా..... సుమలత బుధవారం ఉదయం ఇంట్లో నుంచి వరంగల్ కి షాపింగ్ కోసం వెళ్ళినట్లు స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఇంటికి చేరుకోలేదు. గురువారం ఉదయం ఉపాధి హామీ పనుల నిమిత్తం వెళ్తున్న ఏలుకుర్తి గ్రామస్తులకు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హత్యా సమాచారం అందుకున్న వెంటనే దుగ్గొండి ఎస్సై రణధీర్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. లక్ష్మీపురం శివారు కెనాల్ కాల్వలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతురాలిని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి సుమలత గా పోలీసులు గుర్తించారు క్లూస్ టీమ్ సహాయంతో అక్కడి ఆధారాలను సేకరిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు దగ్గరలో ఒక కత్తి సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మరకలు కాల్వ దగ్గరలో ఉన్నాయి. తోపులాట జరిగినట్లు కాల్వ దగ్గర ఆమె మెడలో ఉండే ముత్యాల దండ పడి ఉంది. చెప్పులు, బ్యాగు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆమెను హత్యకు గురైనట్లు ఉందని పోలీసులు తెలిపారు. సుమలత ను ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. సుమలత దారుణ హత్యకు గురికావడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు, విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :