సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా హోంగార్డు అనూష రూటే సపరేటు అన్నట్లుగా ఉంది. వేములవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలువాల్సిన హోంగార్డు, బ్లాక్ మెయిల్‌తో మోసాలకు తెరలేపింది. తన భర్త ఆరోగ్యం సరిగా లేదని డబ్బున్న వాళ్ళను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి శేఖర్, ఈ మాయ లేడీ హోంగార్డు వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగులేదని అతని వద్ద నుంచి 3 లక్షల 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డు. ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆ మాయ లేడీని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్ మెయిల్‌కు పాల్పడింది.మహిళా హోంగార్డు అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని శేఖర్ అడుగగా బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. శేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేసి పెళ్లి పత్రిక తయారు చేసింది. అతను తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారంతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలను పెళ్లి పత్రికను బయటపెడుతానని బెదిరించింది. ఆ పోటోలు బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన శేఖర్ ఐదు లక్షల రూపాయలు మాయలేడీ హోంగార్డుకు ముట్టజెప్పాడు. ఇలా అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసి అందినకాడికి దండుకునే పనిలో నిమగ్నమైంది. తాజాగా మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించింది. విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళా హోంగార్డు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు....
-----------------------
Admin