సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల్ దేవర చెరువు మండలం లో ఉత్సవ విగ్రహాల దాతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలుశ్రీ కోదండ రామాలయంలో శనివార అభిషేక పూజలు... అల్లాపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గౌనీ పల్లి గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు ఉదయం శ్రీరామ,శ్రీ సీతాదేవి ,శ్రీ లక్ష్మణస్వామి,శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వినాయక, శ్రీ సుబ్రమణ్య స్వామికి శనివార అభిషేక పూజలు శ్రీ పంచరత్న సురేష్ శర్మ చే అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌనపల్లి పోలేపల్లి నగలక్ష్మమ్మ, ప్రభాకర్ శెట్టి దంపతులు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు పూజా సామాగ్రి అందించారు. అలాగే జనవరి రెండవ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భముగా మన శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు ఉత్తర ద్వారా ప్రవేశము తెల్లవారుజామున 5:30 గంటల నుండి సాయంకాలం వరకు ఉత్తర ద్వార ప్రవేశము జరుగును .ఈ కార్యక్రమంలో శశి శేఖర్ సిటీ, గాయత్రి దేవి పాల్గొన్నారు.
-----------------------
Admin