సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : -జిల్లాలో పారిశ్రామిక, పని ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్ -కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో బాల కార్మికు వ్యవస్థ నిర్మూలన సాధ్యపడుతుందని కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు, ఆపరేషన్ స్మైల్ - 12 లో భాగంగా మంగళవారం రోజున వరంగల్ పోలీస్ కమిషనరరేట్ పరిధి వరంగల్ హనుమకొండ జనగాం జిల్లాల అధికారులు పోలీసులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం అదనపు డీసీపీ ఎన్ రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపి సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నిబంధనల ప్రకారం జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం, కార్మిక శాఖ, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ , మరియు చైల్డ్ హెల్ప్ లైన్, స్కోప్, షేర్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.గత ఆపరేషన్ స్మైల్ ముష్కాన్ కార్యక్రమం ద్వారా 339 బాలలను రెస్క్యూ చేసినామని, 26 ఎఫ్ఐఆర్ లు, 160 ఐఆర్ లు నమోదు చేశామని అన్నారు.పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాల కార్మిక నిర్మూలన చట్టం ప్రకారం సంబంధిత యజమానులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని, పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాలల న్యాయ చట్టం ప్రకారం యజమానులపై కేసులు నమోదు చేయాలని అన్నారు.స్పెషల్ డ్రైవ్ విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సాధ్యమవుతుందని, రోజు వారీ నివేదికలు కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో సేకరించి నివేదికలు అందజేయాలని అన్నారు, కార్యక్రమంలో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వినోద,ఎన్సిఎల్పి డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్, బాలల సంక్షేమ సమితి ఛైర్పన్ లు ఉప్పలయ్య, వసుధ, సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఎస్ ప్రవీణ్ కుమార్, ఎల్ రవికాంత్, ఉమా, చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్స్ ఎస్ భాస్కర్, కల్పన, రవికుమార్ ఏ హెచ్ టి యు ఎస్ఐ సుధాకర్, భాగ్యలక్ష్మి డబ్ల్యూ ఎస్ ఐ, సముద్దీన్ హెచ్ సి, పీసీ శ్రీనివాస్, రాము లు, ఎఫ్ ఎం ఎం ఎస్ ఎస్ ఎస్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ బత్తుల కరుణ, ప్రోగ్రాం ఆఫీసర్ ఎర్ర శ్రీకాంత్, మై ఛాయిస్ ఫౌండేషన్ స్టేట్ కో ఆర్డినేటర్ జన్ను క్రాంతి, షేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బి జమున, డివిజన్ ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది, కార్మిక శాఖ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter