Thursday, 30 July 2026 06:43:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గాజుకుంట్లపల్లి గ్రామము నందు లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం...

Date : 02 April 2023 02:16 AM Views : 788

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం లోని గాజుకుంట్లపల్లి గ్రామము నందు లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడంమైనది. గ్రామములోని రైతులు వారి దూడలని ఈ కార్యక్రమానికి తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు పశు సంవర్ధక శాఖ అనంతపురం (డిప్యూటీ డైరెక్టర్ )డాక్టర్ టీ. వీ. సుధాకర, మాట్లాడుతూ దూడల సంరక్షణ మరియు వాటి ఎదుగుదలకి తగు సూచనలు చెప్పి, దూడలకు మందులు తాపించి మరియు కార్యక్రమములో పాల్గొన్న దూడలకీ ప్రథమ, ద్వితీయ ,తృతీయ దూడలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దూడకి బహుమతులు అందచేయడం జరిగింది,దూడల ఎదుగుదల మరియు వాటి యొక్క పునరుత్పత్తి సామర్థ్యం కొరకు ఎముకల పొడి యొక్క ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో (SEX SORTED SEMEN) సెక్స్ క్రమబద్ధీకరించబడిన వీర్యం గురించి తెలియచేస్తూ 1350 విలువ గల రెండు straw స్ట్రా లు ప్రభుత్వం 500 రూపాయలకే అందించడం జరుగుతుంది.ఈ( straw )స్ట్రా ల యొక్క ప్రత్యేకత ఏమీ అంటే 95% ఆడ దూడలే పుడతాయి. ఈ రెండు( straw) స్ట్రా లలో మొదట ఒకటి వేయడం జరుగుతుంది.ఆ పశువు మళ్ళీ ఎదకు వస్తే రెండవ( straw ) స్ట్రా కూడా వేయడం జరుగుతుంది.రెండు (straw) స్ట్రాలు వేసిన కూడా కట్టక పోతే వారి యొక్క 500 రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది.రెండూ స్త్రా లు వేసిన తర్వాత మగ దూడ పుడితే 250 రూపాయలు వెన్నకి ఇవడ్డం జరుగుతుంది అని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో గాజుకుంటపల్లి సర్పంచ్ సి.బాబా ఫకృద్దిన్, ఓబుల దేవర పశు వైద్య అధికారి ప్రవీణ్ కుమార్ , పశు సహాయకులు జోష్ణ, కుమార్ నాయక్ మరియు గాజుకుంటపల్లి గోపాలమిత్ర పి.నరసింహమూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :