సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు పూర్తి జాగ్రత్తలు వహించాలని షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న ప్రజలకు సూచించారు. గురువారం పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా వానలో తడుస్తూనే సిబ్బందికి సూచనలు జారీ చేశారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ పొంగుతుందో తెలుసుకున్నారు. స్థానిక సిబ్బంది, జవాన్లతో మాట్లాడి వారికి సూచనలు సలహాలు ఇచ్చారు.. లోతట్టు ప్రాంతాలు మరియు శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించి, జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత జవాన్లు, వార్డు అధికారిని ఆదేశించారు. వానలకు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి సమాచారం అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పలు సునీత ప్రాంతాలను పర్యటించి పరిశీలించినట్లు కమిషనర్ వెంకన్న చెప్పారు. మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలని కోరారు.
-----------------------
Admin