సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మార్వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సుశీల కి వినతిపత్రం అందజేశారు... .హుజూర్నగర్ పట్టణంలోని స్థానిక ఉస్మానియా మసీద్ వక్స్ షాపింగ్ కాంప్లెక్స్లో షాపు నెంబర్ 5 పై తప్పుడు పత్రాలు సృష్టించి మసీదు వక్స్ బోర్డు ఆస్తులను లక్షల రూపాయలకు అమ్మకానికి ప్రయత్నిస్తున్న కిరాయిదారురాలు దామర్ల భూలక్ష్మి పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ఉస్మానియా మసీదు *షాపింగ్ కాంప్లెక్స్ కట్టిది 1995 సంవత్సరంలో నిర్మాణం జరిగి వ్యాపారాలు కొనసాగుతున్నాయని కానీ మీరు 30 సంవత్సరాలుగా దామెర్ల భూలక్ష్మి,పండ్ల హుస్సేన్ జాయింట్ గా పార్టనర్షిప్లో వ్యాపారం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే సైది రెడ్డి వక్స్ బోర్డ్ ఆస్తిని ముస్లింలకు కాకుండ వేరే వారికి ఎలా కట్టబెడతారని ఈ అంశంలో పూర్తిస్థాయిలో అవగాహన లేకుండా 30 సంవత్సరాలుగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారని మీరు రికమండేషన్ లెటర్ రాయటానికి మీ ఎమ్మెల్యే స్థాయికి తగదని వారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి హితవు పలికారు.ఎమ్మెల్యేగా మీరు మసీదు వక్స్ బోర్డ్ ఆస్తులలో సున్నితమైన అంశాలలో జోక్యం చేసుకొని కొత్తవివాదాలు సృష్టించొద్దని మరలా ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని వారి సందర్భంగా అన్నారు.తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఉస్మానియా మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 5 ను స్వాధీనం చేసుకొని అర్హులైన ముస్లిం సోదరులకు వక్స్ బోర్డ్ నిబంధనల ద్వారా ఈ షాపును కేటాయించాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ముస్లిం మహిళలు ఎండి. అజీజ్ పాషా, పఠాన్ గౌస్ ఖాన్,ఎండి జిలాని, మిల్లు రహీం, ఎస్ కే అలీ, కరీమా, జానీ బేగం, రజియా బేగం, అక్బర్ బాషా,బాబా, రసూల్, ఇబ్రహీం,అఖిల్, ఎండి జానీ మియా, సలావుద్దీన్,మజీద్, సిరాజ్ భాయ్,భాష,హనీ,రియాజ్, ఎండి నజీర్,నిసార్, మోహిన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin