సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : తెలంగాణ ప్రభుత్వం సిఎం కేసీఆర్, వారి మంత్రి వర్గం పనితీరు ". ఆడలేక మద్దెల దరువు '' వెనుకటి సామెత చందంగా ఉందనీ , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుని విమర్శించే అర్హత,హక్కు మంత్రి గంగుల కమలాకర్ కి లేదనీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్థాయి సీనియర్ నాయకులు, నేరేడుచర్ల టిడిపి మండలాధ్యక్షులు ఇంజమూరి వెంకటయ్య విమర్శించారు. పాలకవీడు మండల కేంద్రంలో పత్రికాముఖంగా మాట్లాడుతూ ఒక బాధ్యత గల హోదాలో ఉండి మాట్లాడే సమయాన ఆత్మపరిశీలన అవసరమని , ఇంతకూ నేనెవరిని ఈ స్థాయి కి రావడానికి నాకు ఎవరు తోడ్పాటు నందించారనీ ఏ పార్టీ ద్వారా నాకు గుర్తింపు వచ్చిందనే కనీస జ్ఞానం లేక పోవడం బాధాకరమని చంద్రబాబు,రేవంత్ రెడ్డి గురు శిష్యులనే ముందు కేసీఆర్ పోర్టుఫొలియోలో పనిచేస్తున్న మంత్రివర్గంలో తొంభైశాతం మంది రాజకీయంగా ఎక్కడనుండి వచ్చారనేది గమనించక పోవడం,గురిగింజ సామెతల వుందనీ,తెలుగుదేశం పార్టీ చాలాకాలం నుండి అధికారంలో లేకున్నా పార్టీ ప్రజల హృదయాల్లో , నిరంతరం ప్రజాసమస్యల పట్ల నిలబడి పొరాతుందనీ చంద్రబాబునాయుడు జాతీయ నాయకుడని ఏపార్టీ ద్వారానైతే గుర్తింపు, గౌరవం, ఆర్ధికాభివృద్ది చెందినారో అదే పార్టీని,అవకాశం కొరకు పార్టీలు మారి మానవత్వం మర్చిపోవడం విచారకరమనీ మంత్రి గంగుల ఆత్మ పరిశీలన చేసుకోవాలనీ,కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరే చంద్రబాబు నాయుడు శిష్యుడు కాడని టీఆర్ఎస్ ( టిఆర్ఎస్ ) పార్టీలో ఉన్న సి.ఎం.తో సహా ఎమ్మెల్యేలు,మంత్రులు చంద్రబాబు శిష్యులే ననీ టీఆర్ఎస్ పార్టీలో మెజార్టీ కార్యకర్తలు టీడీపీ వారేననీ నాయకులను తయారుచేసి , నాయకత్వం నేర్పేది తెలుగుదేశం పార్టీ అనీ నేటికైనా గుర్తెరిగి టీడీపీని , చంద్రబాబు నాయుడుని విమర్శించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈసమావేశంలో పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు కొనకంచి సైదులు వర్మ , మండలకార్యదర్శి నెమ్మాది సుందరయ్య ,మండల పార్టీ ఉపాధ్యక్షుడు బొలగాని లింగయ్య గౌడ్ ,నాయకులు నల్లమేకల యలమంద,షేక్ సత్తార్,షేక్ మస్తాన్ పాల్గొన్నారు.
-----------------------
Admin