సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్ నియోజకవర్గం, హయత్ నగర్ డివిజన్ పరిధిలోని మీధాని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, జంగం అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని, అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుకను తెలంగాణలో దీన్ని పేత్రమాస అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.ఇలా చేసిన నివేద్యాన్ని అందరికి పంచుతారు.మీదాని కాలనీ వాసులు, ఆడపడుచులు, చిన్నారులు పెద్దలు కలిసి బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు
-----------------------
Admin