Tuesday, 15 September 2026 06:42:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ పట్టణ ఆరో వార్డులో వీర్లపల్లి శంకర్ బస్తిబాట...

Date : 03 August 2023 11:20 PM Views : 221

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని, సీఎం కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించామని అదే విధంగా రైతు రుణమాఫీ వడ్డీలతో సహా మొత్తం చెల్లించాలి అంటూ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణ ఆరో వార్డులో వీర్లపల్లి శంకర్ బస్తిబాట కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. చెన్నయ్య ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కలిసి ఆరో వార్డులో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే నేడు సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కలిసి రుణ మాఫీ గురించి డిమాండ్ చేసిందనీ, రుణమాఫీ అమలు చేయకపోతే బ్యాంక్‌ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించాం అని గుర్తు చేశారు. కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించాం అన్నారు. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ నాలుగు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది. రైతు రుణమాఫీ వడ్డీలతో సహా మొత్తం చెల్లించాలి. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ అందేవరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుంది. అని శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, చెంది తిరుపతి రెడ్డి, కే. చెన్నయ్య, నల్లమోని శ్రీధర్, ముబారక్ అలీ ఖాన్, రాజు, తుపాకుల శేఖర్, షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :