Monday, 14 September 2026 06:08:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యూత్ కాంగ్రెస్ సమావేశంలో రేవంత్‌ రెడ్డీ, రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్.

Date : 10 June 2023 01:14 AM Views : 568

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్ అన్నారు. యువజన కాంగ్రెస్ జాతీయ స్థాయి కీలక సమావేశాల్లో పాల్గొన్న శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండవ రోజు యువజన కాంగ్రెస్ సమావేశాలకు రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి తదితరులు హాజరయ్యారని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారని అందేమోహన్ తెలిపారు. కత్రియా హోటల్‌లో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారని ఆయన అన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మీరంతా కష్టపడాలి. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని దిశా నిర్దేశం చేసినట్టు చెప్పారు. రాజకీయ భవిష్యత్‌కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని నాయకుడిగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక అనీ ఆయన తెలిపారు. 1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని, డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అనీ, వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అనీ, బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. అని రేవంత్‌ పిలుపునిచ్చారని పేర్కోన్నారు. ఇక సెప్టెంబర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను పార్టీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని ప్రకటించారు. కర్ణాటక తరహాలో ముందే మేనిఫెస్టో విడుదల చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోందని, ఇప్పటికే యూత్, రైతు, నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిందని, త్వరలో మరిన్ని డిక్లరేషన్స్ ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని, మేనిఫెస్టో ఆలస్యం చేయడం వల్లే గతంలో ఇబ్బంది పడినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పంటకు మద్దతు ధరతో పాటు బోనస్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, రైతుబందు సహాయం పెంపు, చదువుకునే అమ్మాయిలకి ఎలక్రికల్ బైక్స్, నిరుద్యోగ భృతి మొదలగు అంశాలు పొందపరచనున్నారని స్పష్టం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: