Wednesday, 29 July 2026 06:42:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గంగమ్మతల్లి దిష్టిబొట్టు వారోత్సవాలు...

Date : 09 July 2023 07:09 AM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం ఇనగలూరు పంచాయతీ రామిరెడ్డిపల్లి గ్రామ దేవత శ్రీ గంగమ్మతల్లి దిష్టిబొట్టు వారోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం అమ్మవారి ఆలయం ముఖాద్వారం వద్ద నవగ్రహ హోమం,అష్టద్గిపాల హోమం తదితర హోమాలు ప్రత్యేక పూజలు పురోహితులు రామ్మూర్తిస్వామి, హరీష్ శర్మ స్వాములు మంత్రోచ్చారణతో నిర్వహించిన్నట్లు మాజీసర్పంచ్ రామచంద్రరెడ్డి, గ్రామస్తులు తెలిపారు. గ్రామదేవత శ్రీ గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట నిర్వహించి మండలకాలం (45 రోజులు)పూజా కార్యక్రమంలో భాగంగా నేటి నుండి అమ్మవారికి డిస్టిబొట్టు,బోనణాల వారోత్సవాలు ప్రారంభ పూజలతో ఈనెల 16వ తేది(ఆదివారం) వరకు నిర్వహిస్తారని,ఉత్సవ ఏర్పాట్లుకు తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి డిష్టిబొట్టు పూజా కార్యక్రమంలో వివిధ ప్రాంతాల భక్తులు,ప్రజలు పాల్గోని దర్శించి,అన్నప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈసందర్బంగా అయన కోరారు. అమ్మవారి హోమం, అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమంలో గ్రామ మహిళలు,భక్తులు పాల్గోని అమ్మవారికి కాయ కర్పూరం, పుష్పం సమర్పించి దర్శనం చేసుకొన్నారు. భక్తులకు అన్నతీర్థప్రసాదాలు అందించినట్లు తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :