సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశానుసారం ఆదివారం రోజు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్మూర్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ప్రకాష్, కార్యదర్శి భాను రామగిరి ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ శిబిరాల్లో స్పెషలిస్టులు ప్రముఖులు వైద్యులు ఉచితంగా వైద్య సేవలను అందించనున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో అంకాపూర్ పిప్రి ఆలూరు వేల్పూర్ అక్లూర్ పడగల్ బడా భీంగ గ్రామాలను ఆర్మూర్ పట్టణంలోని దత్తత తీసుకొని ఉచిత వైద్య ప్రముఖు ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులు దత్తత తీసుకొని ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. ఐఎంఏ నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐఎంఏ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్ కార్యదర్శి డాక్టర్ డాక్టర్ భాను రామగిరి డాక్టర్ రాకేష్ కోరారు...
-----------------------
Admin