Wednesday, 29 July 2026 05:09:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...

Date : 23 December 2023 11:43 PM Views : 253

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఎక్కడకూడా రాజీ పడకుండా ప్రభుత్వం పారదర్శకతతో అందచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రామస్వామి గుట్ట వద్ద ఆదర్శ నగర్ లో నిర్మించిన 2160 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలసి పరిశీలించారు. తదుపరి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నియోజక వర్గ స్థాయిలో జరుగు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అమలుపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్ వెంకట్రావ్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలసి మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ 2013లో స్థానికంగా గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను 3 నెలల లోపు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందచేసి రాష్ట్రం లోని ఇందిరమ్మ ఇండ్లకు నాంది పలుకుతామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన 109 ఎకరాల భూమిని దాదాపు రూ. 20 కోట్లు రెవెన్యూ శాఖ ద్వారా చెల్లించి గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించడం జరిగిందని దాదాపు 70 శాతం పూర్తి అయిన పనులు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వరకు కూడా రూ.30 కోట్లు కేటాయించి పూర్తి చేయకపోవడం ఒక దుర్మార్గ మైన చర్యగా ఆయన అభివర్ణించారు. గత పది సంవత్సరాలుగా నియోజక వర్గంలో కేవలం 150 రెండు పథకాల గదుల ఇండ్లు నిర్మించి నిజమైన నిరుపేదలకు అందలేదని అన్నారు. 77 ఎకరాలలో ఉన్న ఆదర్శ కాలనీ ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అలాగే 32 ఎకరాలలో ఉన్న ఖాళీ స్థలంలో అర్హులైన వారిని గుర్తించి అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో సుపరిపాలన అందిస్తామని పాలకులం కాదు.సేవకులుగా ప్రజా సేవకు అంకితమవుతామని చెప్పారు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఒక్క గజం భూమి కూడా వదలమని తిరిగి అట్టి భూములను అర్హులైన పేదలకు అందించి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అన్నారు. గత ప్రభుత్వం మాటల గారడితో రాష్ట్రంలో ఎన్నో శంకుస్థాపన లు చేసుకుంటూ పోయిందని , రాష్ట్రాన్ని అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని ఈ సందర్బంగా తెలిపారు. ఈ నెల 27న ప్రజలకు తీపి కబురు ఉంటుందని అలాగే 6 గ్యారెంటిలతో పాటు మ్యానిఫెస్టో గల అన్ని అంశాలను పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. రెండు పడకలలో నచ్చిన వారికి ఇండ్లను అందచేసినట్లు ఫిర్యాదులు అందాయని అట్టి వారిపై విచారణ జరిపి అర్హులైన పేదలకు అందించాలని కలెక్టర్ కు సూచించారు. తదుపరి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల రంగంలో పటిష్ఠ ప్రణాళికతో రైతులకు మెరుగైన నీటి సదుపాయం కల్పిస్తామని జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ లు, చెక్ డ్యామ్స్ లను పునరుద్ధరించడం జరుగుతుందని అన్నారు. పి.ఆర్. అలాగే ఆర్.అండ్ బి శాఖ ల ద్వారా రోడ్ల మరమ్మత్తులు అలాగే కొత్త రోడ్లను వేపిస్తామని అన్నారు. మా ప్రభుత్వ హయాంలో ఒక ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ అనే మరిచిందని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ 6 గ్యారంటీలను రాజకీయాలకు అతీతంగా అందచేస్తామని ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు. రైతులకు ఎక్కడకూడా నష్టం వాటిల్లకుండా అనుబంధ శాఖల అధికారులు నిబద్ధతగా పనిచేయాలని లిఫ్ట్ ఇరిగేషన్ ల వద్ద ఉన్న ట్రాన్స్ ఫర్ మరమ్మత్తులు సత్వరమే చేసి వినియోగం లోకి తేవాలని ప్రభుత్వం నుండి నిధులను సత్వరమే విడుదల చేస్తామని ఈ సందర్బంగా సూచించారు. తదుపరి అన్ని శాఖల అధికారులతో నియోజక వర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్, హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి, సి.ఈ. ఓ సురేష్ కుమార్, పి.డి. కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు , ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :