సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఏమనుకుంటుంది ఏం చేద్దాం అనుకుంటుంది ఎంతవరకు రుణమాఫీ చేస్తారు ఒక స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు క్యాబినెట్ మంత్రులు పూటకో మాట పొంతన లేని సమాధానాలు వారానికో మాట రోజుకో మాట ముఖ్యమంత్రి ది ఓ మాట చెప్పాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర క్యాబినెట్ లో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో అట్టర్ ప్లాప్ అయిన ప్రభుత్వం రైతాంగాన్ని గందరగోళ పరిస్థితులలోకి నెట్టేసిందని అన్నారు ముఖ్యమంత్రికి మంత్రులకు సరియైన అవగాహన లేకపోవడమే ప్రతి విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎద్దేవా చేశారు రైతు రుణమాఫీ 49 వేల కోట్లు చెప్పి మళ్లీ దాన్ని 31 కోట్లు అని మరోసారి చెప్పి బడ్జెట్లో 26 వేల కోట్లు పెట్టామని ఇప్పటివరకు 18 వేల కోట్లు రిలీజ్ చేశామని చెప్పి ఇప్పటివరకు పదివేల కోట్లు కూడా చేర్చలేదని తెలియజేశారు. బ్యాంకుల నుండి సమాచారం తీసుకుని రైతులను మోసం చేయడం కొరకు అగ్రికల్చర్ అధికారులను కలవాలని బ్యాంకులను కలవాలని కలెక్టర్ ను కలవాలని మళ్లీ ఇప్పుడు మీ ఊరికే పంపిస్తామని రాష్ట్రంలో ఉన్న రైతులకు ఒక స్పష్టత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రైతులను మోసం చేసిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు మోసం చేయాలని చూస్తుందని ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకోటి ఉండదని అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని 2014 కంటే ముందు ఏ పరిస్థితి అయితే ఉందో విద్యుత్ రంగంలో ఆ పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చారని ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రుల వరకు వ్యక్తిగత సంపాదన మీద పడ్డారని ప్రజలకు సేవలు అందించాలన్న ఆలోచనలో ఏ ఒక్కరూ లేరని అన్నారు. రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం ఒక స్పష్టత తీసుకోవాలని రైతులకు క్లారిటీ ఇవ్వాలని మిమ్మల్ని నమ్మి 2 లక్షల రుణమాఫీ చేస్తారని 15000 రైతు భరోసా ఇస్తారని నమ్మి రాష్ట్ర రైతులు మొత్తం మీకు ఓట్లు వేసి అవకాశమిచ్చారని మిమ్మల్ని గెలిపించింది రాష్ట్ర రైతాంగమే అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు, రెండు లక్షల రుణమాఫీ చేసే ఆలోచన ఉందా లేదా రాష్ట్ర ప్రభుత్వ స్వస్థత ఇవ్వాలని వానాకాలం వచ్చే సమయం వచ్చిన రైతు బంధు లేదు రైతు భరోసా లేదు వెంటనే రైతు భరోసా ప్రారంభించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఖమ్మం సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నర్సంపేట ములుగు ఆదిలాబాద్ చాలాచోట్ల లక్షలాది పంట నష్టం అయ్యిందని పెట్టుబడి సాయం ఇవ్వక ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు వరద బాధితుల విషయంలో ప్రజలు అధికారులు నాయకుల నుండి ఏ సహాయం అందలేదని తెలిపినట్లు తెలియజేశారు ప్రభుత్వానికి సోయం ఉందా ముందస్తు ప్రణాళిక లేక రాష్ట్ర ప్రజలను రైతులను ఇబ్బందులు పాలు చేస్తుందని పరిపాలన అనుభవం లేక మీ సోమరితనంతో వరదల విషయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేకపోయారని మండిపడ్డారు ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తుంటే మాకు ఆటంకాలు కలిగిస్తున్నారని తెలియజేశారు.
-----------------------
Admin