సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండల పరిధిలోని మీగడంపహాడు తండా గ్రామంలో, నూతన పంచాయతీ కార్యాలయ నిర్మాణానికిఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ స్థానిక సర్పంచ్ భూక్యరాంబాయిరవినాయక్ , లతో కలిసి గురువారం నాడు శంకుస్థాపన చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో మారుమూల గిరిజన తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పడడం,స్వయంపాలనలో గిరిజనులకు ప్రాధాన్యత దక్కడం పట్ల బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రవి నాయక్ ఆనందం వ్యక్తం చేశారు.ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి 20 లక్షలు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శాంక్షన్ అయినట్టు సర్పంచ్ తెలిపారు.ఈ నిర్మాణానికి అవసరమైన రెండు గుంటల స్థలాన్ని తామే ఇచ్చామన్నారు.పంచాయతీ నిర్మాణానికి సహకారం అందించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ విజయభద్రు,స్పెషల్ ఆఫీసర్ ఏఈఓ శారద,వార్డుమెంబర్లు అంజి,ధనావత్ సరోజ,రమేష్, బొబ్బవెంకట్రెడ్డి,సైదులు, మూడు గోపాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin